చెన్ను జర్నలిజం అకాడమీకి స్వాగతం
“సత్యం… న్యాయం… వార్త”
ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ఒక శక్తివంతమైన స్తంభం. సమాజానికి నిజమైన సమాచారాన్ని చేరవేయడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజల తరఫున మాట్లాడడం వంటి అత్యంత బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని జర్నలిస్టులు నిర్వహిస్తారు. అందుకే జర్నలిజం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు; అది ప్రజాసేవకు అంకితమైన గొప్ప వృత్తి.
విజన్
ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించగల, సత్యనిష్ఠతో పనిచేసే,
నైతిక విలువలను పాటించే,సమాజానికి ఉపయోగపడే
జర్నలిస్టులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్థాపించినదే
చెన్ను జర్నలిజం అకాడమీ

మా అకాడమీ గురించి
చెన్ను జర్నలిజం అకాడమీ అనేది జర్నలిజాన్ని ప్రేమించే ప్రతి విద్యార్థికి ఒక అభ్యాస వేదిక. ఇక్కడ పుస్తకాలకే పరిమితమైన బోధన కాదు… నిజమైన మీడియా ప్రపంచంలో అవసరమైన ఆలోచనా విధానం, వార్తలను గుర్తించే సామర్థ్యం, విశ్లేషణ నైపుణ్యం, రచనా శైలి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసే విధంగా శిక్షణ అందిస్తాం. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, ఒక బాధ్యతాయుతమైన మీడియా వృత్తి నిపుణుడిగా ఎదగడానికి అవసరమైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, ప్రాక్టికల్ అనుభవం అందించడం మా ప్రధాన లక్ష్యం.
మా ప్రత్యేకత
ఈరోజు మీడియా ప్రపంచం వేగంగా మారుతోంది.
ప్రింట్ మీడియాతోపాటు టెలివిజన్, డిజిటల్ మీడియా,
సోషల్ మీడియా, మొబైల్ జర్నలిజం వంటి రంగాల్లో
కొత్త అవకాశాలు విస్తరిస్తున్నాయి.
ఈ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా
విద్యార్థులను తీర్చి దిద్దడం మా ప్రత్యేకత.
📚 మా శిక్షణలో…
📰 జర్నలిజం ప్రాథమిక అంశాలు
వార్తల ప్రపంచానికి బలమైన పునాది.
✍️ వార్తల రచన (News Writing)
ఆకర్షణీయంగా, స్పష్టంగా వార్తలు రాయడం.
🎤 రిపోర్టింగ్ (Reporting)
క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, వార్తల ప్రసారం.
🎙️ న్యూస్ యాంకరింగ్ (News Anchoring)
ఆత్మవిశ్వాసంతో వార్తలను ప్రజలకు అందించే నైపుణ్యం.
💻 డిజిటల్ జర్నలిజం (Digital Journalism)
వెబ్, సోషల్ మీడియా, మొబైల్ జర్నలిజంపై ఆధునిక శిక్షణ.
📊 మీడియా విశ్లేషణ (Media Analysis)
వివిధ మీడియా సంస్థల వార్తల విశ్లేషణ.
🏢 న్యూస్‌రూమ్ ప్రాక్టీస్ (Newsroom Practice)
నిజమైన న్యూస్‌రూమ్ వాతావరణంలో ప్రాక్టికల్ శిక్షణ.
🎥 ఇంటర్వ్యూ టెక్నిక్స్ (Interview Techniques)
సమర్థవంతమైన ఇంటర్వ్యూలు నిర్వహించే, ఎదుర్కొనే పద్ధతులు.
⚖️ మీడియా నైతిక విలువలు (Media Ethics)
సత్యం, నిష్పాక్షికత, బాధ్యతతో కూడిన జర్నలిజం.
🌍 ప్రస్తుత వ్యవహారాల అవగాహన (Current Affairs)
అంతర్జాతీయ, జాతీయ, సామాజిక, రాజకీయ పరిణామాలపై సమగ్ర అవగాహన.
⭐ సిద్ధాంతంతోపాటు ప్రాక్టికల్ శిక్షణ
🎯 “నేర్చుకోవడం మాత్రమే కాదు… ఆచరణలో పెట్టడం కూడా మా శిక్షణలో ముఖ్యమైన భాగం.”
ప్రతి విద్యార్థి మీడియా రంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు సిద్ధాంత బోధనతోపాటు ప్రాక్టికల్ శిక్షణ, అసైన్‌మెంట్లు,
న్యూస్ రూమ్ అనుభవం, మీడియా విశ్లేషణలో ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందిస్తాం.

ప్రాక్టికల్ శిక్షణకు ప్రాధాన్యం
జర్నలిజాన్ని పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకోవడం సాధ్యం కాదు. నిజమైన అనుభవం, పరిశీలన, రచనా నైపుణ్యం, సమయస్ఫూర్తి,
ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యం కూడా అవసరం.
అందుకే మా అకాడమీలో ప్రతి విద్యార్థికి ప్రాక్టికల్ అసైన్‌మెంట్లు, న్యూస్ రైటింగ్ అభ్యాసనలు, మీడియా విశ్లేషణ, వీడియో ఆధారిత శిక్షణ,
ప్రత్యక్ష చర్చలు, న్యూస్‌రూమ్ అనుభవం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఈ విధానం ద్వారా విద్యార్థులు ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు.
మా నమ్మకం
ఒక మంచి జర్నలిస్టు వార్తలను మాత్రమే రాయడు… సమాజాన్ని అర్థం చేసుకుంటాడు…
వాస్తవాలను పరిశీలిస్తాడు… ప్రజల సమస్యలను వినిపిస్తాడు… బాధ్యతతో వ్యవహరిస్తాడు.
అలాంటి బాధ్యతాయుతమైన, నిష్పాక్షికమైన, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే జర్నలిస్టులను తయారు చేయడం మా అకాడమీ ప్రధాన ఉద్దేశ్యం.

మీ భవిష్యత్తుకు తొలి అడుగు
మీరు జర్నలిజంలో కెరీర్‌ను నిర్మించాలనుకుంటున్నారా?
మీరు మంచి రిపోర్టర్, యాంకర్, డిజిటల్ జర్నలిస్టు,
కంటెంట్ రైటర్, మీడియా విశ్లేషకుడు లేదా ప్రజల కోసం
పనిచేసే నిజమైన జర్నలిస్టుగా ఎదగాలనుకుంటే…..
మీ కలలను సాకారం చేసే సరైన వేదిక
చెన్ను జర్నలిజం అకాడమీ
ఇక్కడ మీరు నేర్చుకునేది ఒక కోర్సు మాత్రమే కాదు…
జర్నలిజం యొక్క విలువలు, బాధ్యతలు,
వృత్తి నైపుణ్యాలు మరియు సమాజానికి సేవ చేసే దృక్పథం.
ఇదే మా ఆహ్వానం
మీ కలలను సాకారం చేసే ప్రయాణాన్ని ఈ రోజే ప్రారంభించండి.
చెన్ను జర్నలిజం అకాడమీలో చేరండి…
సత్యాన్ని తెలుసుకోండి… బాధ్యతతో చెప్పండి…
సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టులుగా ఎదగండి.
OUR COURSES
CERTIFICATE COURSE
3 నెలలు
ఫ్యాకల్టీ:
జర్నలిజం లో అత్యంత అనుభవం కలిగి, ప్రస్తుతం అనేక ప్రముఖ వార్తా చానళ్లు, వార్తా పత్రికలు మరియు పేరెన్నికగన్న వెబ్ సైట్స్ లో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు.
DIPLOMA IN JOURNALISM
ఇది నిజమైన ప్రొఫెషనల్ కోర్స్.
దీనిలో మొత్తం 12 Modules ఉంటాయి.
కోర్స్ కాల పరిమితి:
6 నెలలు
