ABOUT THE FOUNDER

చెన్ను పెద్దిరాజు
చైర్మన్ & వ్యవస్థాపక ఎడిటర్
1985లో ట్రైనీ సబ్ ఎడిటర్‌గా జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాలలోని అగ్రగామి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ పాత్రికేయులు.
జర్నలిజం అనేది కేవలం వృత్తి కాదు, ప్రజా బాధ్యత అని విశ్వసించే వీరు, నిష్పాక్షికత, విలువలు, ప్రజాపక్ష దృక్పథాన్ని తమ వృత్తి జీవితం అంతటా ఆచరణలో నిలబెట్టారు.

ప్రింట్ మీడియా దిగ్గజం ఈనాడుతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఈటీవీ-2, తులసి, సీవీఆర్, ఏపి 24×7, 99టీవీ, ప్రైమ్9 వంటి ప్రముఖ సంస్థల్లో డిప్యూటీ న్యూస్ ఎడిటర్ నుంచి చీఫ్ ఎడిటర్ వరకు పలు కీలక హోదాల్లో పనిచేసిన అనుభవం వీరి సొంతం.
ఆ నాలుగు దశాబ్దాల అనుభవాన్ని, వృత్తిపరమైన విలువలను, సంపాదకీయ దృక్పథాన్ని కొత్త తరం జర్నలిస్టులకు అందించాలనే సంకల్పంతో **”చెన్ను జర్నలిజం అకాడమీ”**ని స్థాపించారు.
నిష్పాక్షికత, ప్రజాపక్ష దృక్పథం, విలువలతో కూడిన జర్నలిజమే వీరి జీవిత సూత్రం.
